సున్నుండలు(Sununda/Urad Laddu)

కావలసిన పదార్థాలు:(10 లడ్డులకు సరిపడా)

ఉద్దిపప్పు---2 కప్స్
పెసర పప్పు---1/2 కప్
చెక్కర---2 కప్స్
ఏలకుల పొడి--1/2 టీ స్పూన్
నెయ్యి---1/2 కప్
నట్స్ పౌడర్--1/4 కప్ (జీడిపప్పు, బాదాం ,అక్రూట్)

విధానము:

1.ఉద్దిపప్పు,పెసరపప్పు నూనె వేయకుండా, గోధుమ రంగు వచ్చేలా వేయించుకోవాలి.

2.మిక్సీ జార్ లో ఉద్దిపప్పు, పెసర పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

3.ఒక గిన్నె లో గ్రైండ్ చేసుకొన్న ఉద్దిపప్పు-పెసర పప్పు పొడి, చెక్కర ,ఏలకుల పొడి, నట్స్ పౌడర్ వేసి బాగా కలపాలి.

4.తయారు చేసుకొన్న మిశ్రమం లో కరిగించిన నెయ్యి కొంచం కొంచం వేసుకుంటూ ఉంటలు గా కట్టుకోవాలి.(నెయ్యి వేయడం వల్ల సున్నుండ బాల్ లాగా గట్టిగా అతుకుంటుంది)

5.బాల్ లాగా గుండ్రంగా చేసుకొని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.

6.ఎంతో రుచిగా ఉండే సున్నుండలు రెడి.

చిట్కా: పెసర పప్పు వేయడం వల్ల సున్నుండ తినేటప్పుడు పండ్లకు అతుకోకుండా ఉంటుంది మరియు ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

2.సున్నుండలు అరోగ్యానికి ఎంతో మంచిది. ఉద్దిపప్పు లో ఐరన్ ఉండడం వల్ల పిల్లలకు మరియు గర్బిని స్రీలకు ఎంతో మంచిది.


No comments:

Post a Comment