స్ట్రాబెర్రి కప్ కేక్స్(Strawberry Cup Cakes)

కావలసిన పదార్థాలు:(12 కప్ కేక్స్ సరిపడా)

మైదా---2 కప్స్
స్ట్రాబెర్రీస్---12-15
చెక్కర----11/4 కప్
జీడిపప్పు----5
బాదాం-----5
అక్రూట్----5
పాలు---1/2 కప్
బేకింగ్ పౌడర్---2 టీ స్పూన్స్
ఏలకుల పొడి---1/2 స్పూన్
బట్టర్/నెయ్యి/నూనె---3టేబుల్ స్పూన్స్
ఉప్పు---చిటికెడు

విధానము:

1.స్ట్రాబెర్రిస్ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2.జీడిపప్పు,అక్రూట్,బాదాం నున్నగా కాకుండా బరకగా గ్రైండ్ చేయాలి.

3.ఒక గిన్నె లో గ్రైండ్ చేసిన స్ట్రాబెర్రి మిక్స్ ,చెక్కర, బటర్ (నెయ్యి/నూనె కూడా వేసుకోవచ్చు)వేసి బాగా కవ్వం తో చిలికి పక్కన పెట్టుకోవాలి.కవ్వం తో చిలకడం వల్ల మిక్స్ అంతా బాగా కలుస్తుంది.

4.తరువాత ఒక గిన్నె లో మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, గ్రైండ్ చేసిన జీడిపప్పు, బాదాం, అక్రూట్, ఏలకుల పొడి వేసి బాగా కలిపి,పక్కన పెట్టుకొన్న స్ట్రాబెర్రి మిక్స్ కూడా వేసి, పిండి అంతా కలిసేలా కలపాలి.

5.పాలు వేసి,పిండి జారుగా (ఇడ్లి పిండి లా) కలుపుకోవాలి.6.తరువాత కప్ కేకె ట్రే లో,తయారు చేసుకున్నమిశ్రమాన్నిస్పూన్ తో సగానికి వేయాలి.(నిండుగా వేయరాదు)7.తరువాత ఒవన్ 350 డిగ్రీస్ లో పెట్టి 5 నిముషాలు వేడి చేయాలి.

8.ఒవెన్ వేడి అయ్యాక, ట్రే లో వేసిన పిండి ని ఒవన్ లో పెట్టి 25-30 నిముషాలు వేడి చేయాలి.

9.తరువాత ఒవన్ తీసి కప్స్ కేక్స్ బాగా పొంగి, గోధుమ రంగుగా వచ్చినప్పుడు, పుల్ల తీసుకొని కప్ కేక్ పై గుచ్చితే పుల్లకు పిండి అంటకుండా రావాలి.(ఒక వేల పుల్లకు పిండి అంటుకుంటే మరొక 5 నిముషాలు బేక్ చేయాలి).

10.వెంటనే ఒవన్ ఆఫ్ చేసి కప్ కేక్స్ బయట పెట్టాలి.ఎంతో రుచిగా ఉండే స్ట్రాబెర్రి కప్ కేక్స్ రెడి.


No comments:

Post a Comment