రవ అరిసెలు(Rava Ariselu)

కావలసిన పదార్థాలు:

ఉప్మా రవ---1 కప్
బియ్యప్పిండి ---1 కప్
బెల్లం---11/2 కప్
గసాలు---1/4 కప్
ఏలక్కుల పొడి---1/2 స్పూన్
పాలు---1 కప్
నూనె----వేయించడానికి


విధానము:

1.ఉప్మా రవ దోరగా వేయించాలి. ఒక వేల వేయించిన ఉప్మారవ ఉంటే వేయించనవసరం లేదు.

2.బానలి పెట్టి,2 కప్స్ నీళ్ళు వేయాలి. నీళ్ళు బాగా మరిగినాక వేయించిన ఉప్మా రవ/సూజి వేసి ఉంటలు లేకుండా బాగా కలిపి 2 నిముషాలు మూత పెడితే, ఉప్మాలా తయారు అవుతుంది.

3.తరువాత బెల్లం వేసి, రవ లో బాగా కలిసే లా కలపాలి.

4.తరువాత బియ్యప్పిండి కూడా వేసి ,బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి.

5.బియ్యపిండి రవ లో కలవకపొతే,మూత పెట్టినప్పుడు ఆ వేడికి బాగా ఉడుకుతుంది.

6.రవ మిశ్రమము చల్లగా అయ్యాక ,ఒక ప్లేట్ లో తీసుకొని కొంచం కొంచం తీసుకొని నాదుకోవాలి. ఒక వేల నాదడం కష్టమైతే, కొద్దిగా పాలు వేసుకోని పూరి పిండి లా చేసుకోవాలి. ఎక్కువ పాలు వేస్తే జారుగా అవుతుంది.

7.అల్యూమినియం పేపర్ లేక ప్లాస్టిక్ పేపర్ పై కొద్దిగా నెయ్యి రాసి, చిన్న చిన్న పూరీ లా వత్తి,దానిపై కొద్దిగా గసాలు చల్లాలి.

8.తరువాత నూనె వేడిలి పెట్టి, వేడి అయ్యాక, తయారు చేసుకొన్న పూరీలు వేసి, గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.

ఎంతో రుచిగా ఉండే రవ అరిసెలు రెడి.No comments:

Post a Comment