పెసర పప్పు పాయసం(Moong Daal Kheer)

కావలసిన పదార్థాలు:

పెసర పప్పు--1 కప్
పాలు--- 3 కప్స్
బెల్లం---1 కప్
జీడిపప్పు--10
ఏలకుల పొడి---1/2 స్పూన్
నెయ్యి---2 స్పూన్స్


విధానము:

1.బానలి లో 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

2.అదే బానలి లో కొంచం నెయ్యి వేసి, పెసర పప్పు వేసి దోరగా వేయించాలి.

3.తరువాత పాలు వేసి పెసర పప్పు బాగా మెత్తగా ఉడకనివ్వాలి.

4.మెత్తగా పెసర పప్పు ఉడికినాక, బెల్లం కూడా వేసి బాగా ఉడకనివ్వాలి.

5.బెల్లం ,పాలు, పెసర పప్పు బాగా ఉడికి క్రీం లా తయారవుతుంది.

6.తరువాత ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు పాయసం రెడి. ఈ పాయసం చల్లగా/వేడిగా కూడా బాగుంటుంది.

చిట్కా: పెసర పప్పు, బెల్లం దేహానికి వేడిని తగ్గిస్తుంది. ఎండాకాలం లో అప్పుడప్పుడు ఈ పాయసం తింటే అరోగ్యానికి మంచిది మరియు ఎంతో రుచిగా కూడా ఉంటుంది.


No comments:

Post a Comment