బాదాం బర్ఫీ (Almond Burphy)

కావలసిన పదార్థాలు:(10 ముక్కలకు సరిపడా)

బాదాం----1 గ్లాసు

చెక్కర---1 గ్లాసు

పాలు--1/4 గ్లాస్

నెయ్యి----1/2 గ్లాస్

ఏలకుల పొడి---1/2 స్పూన్

విధానము:

1.బాదాం 4 గంటలు నానపెట్టి, పొట్టు తీసి, పాలు వేసి మెత్తగా రుబ్బు కోవాలి.

2.ఒక ప్లేట్ లో 1/2 స్పూన్ నెయ్యి రాసి, పక్కన పెట్టుకోవాలి.

3.వెడల్పాటి బానలి లో చెక్కర వేసి, చెక్కర మునిగే లా నీరు వేసి తీగపాకం చేసుకోవాలి.

4.తరువాత గ్రైండ్ చేసిన బాదాం, ఏలకుల పొడి వేయాలి.

5.కొంచం కొంచం నెయ్యి వేస్తూ, బర్ఫీ అడుగంటకుండా, తిప్పాలి.

6.బాదాం,చెక్కర,నెయ్యి బాగా పీల్చుకొని ముద్దలా తయారవుతుంది.

7.అప్పుడు వెంటనే నెయ్యి రాసిన ప్లేట్ లో, వేసి చల్లగా అయ్యాక, మీకు నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి.

8.కట్ చేసిన ముక్కల పై, బాదాం తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది.

ఎంతో రుచిగా ఉండే బాదాం బర్ఫీ రెడి.


No comments:

Post a Comment