గోధుమ పిండి చెగోడీలు(Wheet Flour Chegodilu)

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి--1 కప్
బియ్యప్పిండి-- 1 కప్
పప్పులు--2 టేబుల్ స్పూన్స్
కొబ్బెర--1 టేబుల్ స్పూన్స్
ఇంగువ-1/4 స్పూన్
కారం--1/2 స్పూన్
నువ్వులు--2 స్పూన్స్
ఉప్పు-- తగినంత
నూనె---1 టేబుల్ స్పూన్
నూనె---2 కప్స్ (వేయించడానికి)

విధానము:

1.పప్పులను పొడి చేసి పెట్టుకోవాలి.

2.గోధుమ పిండి, బియ్యప్పిండి, పప్పుల పొడి, నువ్వులు, ఇంగువ, కారం ,ఉప్పు వేసి 2 టేబుల్ స్పూన్స్ వేడి చేసిన నూనె వేసి బాగా కలపాలి.

3.తరువాత పిండిని కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ చపాతి పిండి లా కలుపుకోవాలి.

4.తరువాత పిండిని 30 నిముషాలు నాన నివ్వాలి.

5.నానిన పిండిని చిన్న చిన్న ఉంటలు గా చేసుకోవాలి.

6.తరువాత చపాతి పీటపై ఉంటను ఉంచాలి.

7.తరువాత చేతికి కొద్దిగా నూనె రాసుకొని ,ఉంటను పొడవుగా చేయాలి.

8.ఇలా చేసిన దాన్ని గుండ్రంగా చుట్టాలి.

9.ఈ విధంగా అన్ని ఉంటలను తయారు చేసుకోవాలి.

10.తరువాత నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక చెగోడిలను వేసి ఎర్రగా వేయించాలి.(చేగోడీలు సన్నటి సెగపై వేయించాలి.లేకపోతే పిండి లోపల వేగక మెత్తగా వస్తాయి)

ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి చెగోడీలు రెడి.


No comments:

Post a Comment