సేమియా పాయసం (Vermicelli kheer)

కావలసిన పదార్థాలు:

సేమియా--1 కప్
చెక్కర---1 కప్
ఏలకుల పొడి--1/4 స్పూన్
నట్స్--అన్నీ 10(జీడిపప్పు, ద్రాక్ష, బాదాం)
నెయ్యి--2 స్పూన్స్
పాలు -- 3 కప్స్


విధానము:

1.నెయ్యిలో సేమియా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

2.నట్స్ కూడా నెయ్యి లో వేయించి పక్కన పెట్టుకోవాలి.

3.తరువాత గిన్నె లో పాలు వేసి కాగనివ్వాలి.

4.పాలు కాగినాక చెక్కర వేసి బాగా కలపాలి.

5.తరువాత పాల్లల్లో చెక్కర బాగా కలిసాక, వేయించిన సేమియా, నట్స్ వేసి ఉడికించాలి.

6.పాల్లల్లో మిశ్రమం బాగా కలిసాక ఏలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం రెడి.

గమనిక:

1.సేమియా పాయసం స్టవ్ ఆఫ్ చేసినాక, గిన్నె లో కొద్దిగా పాలు ఉన్నా, చల్లగా అయ్యాక సేమియా పీల్చుకొని గట్టిపడుతుంది.

2.ఇష్టమున్న వారు రోస్ ఎస్సెన్స్,లేక ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు.


No comments:

Post a Comment