వెజిటబుల్ కూర్మ(Vegitable Kurma)

కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయ--1
కారెట్--1
బీన్స్--10
ఆలుగడ్డ--1
పచ్చి బఠానీలు--1/2 కప్
కాలిఫ్లవర్--1 కప్
కొత్తిమీర--4 రెమ్మలు
గసాలు--1 స్పూన్స్
సోంపు-1 టీ స్పూన్
గరం మసాల--1/2 టీ స్పూన్
ధనియాల పొడి--టీ స్పూన్
పసుపు--టీ స్పూన్
ఎర్ర కారం--టీ స్పూన్
పచ్చి మిర్చి--2
కొబ్బరి తురుము--1/2 కప్
కొబ్బరి పాలు--1 కప్
జీడిపప్పు/వేరు శనగ విత్తనాలు--2 స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్--1 స్పూన్
తిరగమాత
నెయ్యి--1 స్పూన్
నూనె--1 స్పూన్
ఏలకులు--3
లవంగాలు--3
చెక్క--1/2 ముక్క
బిర్యాని ఆకు--2
సోంపు --1 స్పూన్

విధానము:

1. అన్ని కూరలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో పెట్టి 1 విసిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.2. తరువాత ఉడికిన కూరలను నీరు లేకుండా వాడ్చుకొని,ఆ నీరును పక్కన పెట్టుకోవాలి.(నీరును కూరలో వాడుకోవాలి).

3. తరువాత మిక్సీ లో గసాలు,సోంపు,జీడిపప్పు/వేరు శనగ విత్తనాలు,పచ్చి మిర్చి,కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.4. బాణలి పెట్టి నెయ్యి,నూనె వేసి వేడి అయ్యాక లవంగాలు,ఏలకులు,చెక్క,బిర్యాని ఆకులు వేసి దోరగా వేయించాలి.

5. తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.

6. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

7. తరువాత ధనియాల పొడి,పసుపు,ఎర్ర కారం,గరం మసల వేసి బాగా కలపాలి.

8. తరువాత ఉడికించిన కూరలు వేయాలి.

9. తరువాత గ్రైండ్ చేసిన పేస్ట్,కొబ్బరి పాలు వేసి బాగా కలపాలి.

10. తరువాత ఉప్పు వేసి బాగా కలపాలి. కూర గట్టిగా ఉంటే పక్కన పెట్టుకున్న నీరు వేసి అడుగంటకుండా 5-7 నిముషాలు ఉడికించాలి.

11. చివరి లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ కూర్మ రెడి.ఇది పూరి/చపాతి/పరాట/జీర రైస్ తో తింటే చాలా బాగుంటుంద.
No comments:

Post a Comment