వడపప్పు/కోసంభరి/పెసర పప్పు (Vada Pappu / Kosambari / Pesara Pappu)

కావలసిన పదార్థాలు: (నలుగురికి సరిపడా)

పెసర పప్పు---1 కప్
దోసకాయ/కీరా---1 చిన్నది
కారెట్----1 చిన్నది
పచ్చి కొబ్బెర తురుము---1/2 కప్
పచ్చి మిర్చి ----2
అల్లం---- చిన్న ముక్క
కొత్తిమీర---1/4 కట్ట
ఉప్పు----1 స్పూన్

తిరగమాత గింజలు:
నూనె---1 స్పూన్
ఇంగువ--- చిటికెడు
ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర (అన్నీ--1/4 స్పూన్)
*(బానలి లో 1 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి)

విధానము:

1.పెసర పప్పు 30 నిముషాలు నాన పెట్టి, నీరు లేకుండా వడగట్టాలి.

2.దోసకాయ చిన్నగా తరుక్కోవాలి.(దోసకాయ తురిమితే నీరు అంతా బయటకు వచ్చేస్తుంది)

3.కారెట్, తురుము కోవాలి.

4.అల్లం,కొత్తిమీర కూడా చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

5.పచ్చి మిర్చి పెద్దవిగా తరుక్కోవాలి. (కారం ఇష్టం లేనివారు మిర్చి తీసేయవచ్చు)

6.పచ్చికొబ్బెర కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి.

7.ఒక గిన్నె లో, నానపెట్టిన పెసర పప్పు, తరిగిన దోసకాయ, అల్లం, పచ్చి మిర్చి, తురిమిన పచ్చి కొబ్బెర తురుము, కారెట్ తురుము వేయాలి.

8.తరువాత తిరగమాత వేసి బాగా కలపాలి.

9.తినడానికి ముందు, ఉప్పు వేసుకోవాలి. (ముందే ఉప్పు వేస్తే కూరల లో ఉన్న నీరు అంతా బయటకు వచ్చేస్తుంది)

ఎంతో రుచిగా ఉండే వడపప్పు/కోసంభరి/పెసర పప్పు రెడి.


No comments:

Post a Comment