టమొటా-ఉల్లిపాయ కూర (Tomato Onion Curry)

కావలసిన పదార్థాలు (నలుగురికి సరిపడా):

ఉల్లిపాయలు--2
టమొటా--6
పచ్చి మిరపకాయలు---3
జీలకర్ర పొడి--1/2 స్పూన్
ధనియాల పొడి--1/4 స్పూన్
మెంతులు---1/4 స్పూన్
ఉప్పు---తగినంత
తిరగమాత గింజలు: (అన్నీ 1/4 స్పూన్)
ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర
ఇంగువ--చిటికెడు

విధానము:

1.మెంతులు ఎర్ర గా వేయించి పొడి చేసుకోవాలి.

2.ఉల్లిపాయలు,టమొటా,అల్లం,పచ్చి మిర్చి చిన్న ముక్కలు గా తరిగి ఉంచుకోవాలి.

3.బానలి పెట్టి, 2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు వేసుకోవాలి.

4.ఆవాలు చిట చిట అన్నాకా, మెంతి పొడి, ఇంగువ వేసి, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి.

5.ఉల్లిపాయలు కొంచం వేగినాకా పచ్చి మిర్చి, టమొటా, అల్లం, వేసి బాగా వేయించాలి.

6.తరువార ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి ,(కారం ఎక్కువ కావాలనుకుంటే ఎర్ర కారం వేసుకోవచ్చు).

7.చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే టమొటా-ఉల్లిపాయ కూర రెడి.ఈ కూర అన్నం /చపాతి/పూరీకి బాగుంటుంది.


No comments:

Post a Comment