చెక్కర పొంగలి /పరమాన్నం(Sweet Pongal/Paramaannam)

కావలసిన పదార్థాలు :

బియ్యం--3/4 గ్లాస్
శనగ పప్పు--1/4 గ్లాస్
బెల్లం--3/4 గ్లాస్
ఏలకులు--4
జీడిపప్పు--8
ఎండు ద్రాక్ష--8
నెయ్యి--6 స్పూన్స్
పచ్చ కర్పూరం--చిటికెడు


విధానము:

1.బియ్యం+శనగపప్పు బాగా కడిగి 2 గ్లాసులు నీరు వేసి కుక్కర్ పెట్టి 2 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

2.తరువాత బాణలి పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించాలి.

3.తరువాత ఉడికించిన బియ్యం శనగ పప్పు, బెల్లం పొడి, కొద్దిగా నీరు వేసి బాగా కలపాలి.

4.తరువాత అన్నంలో బెల్లం బాగా కరిగి, ముద్దగా అయ్యాక ఏలకుల పొడి, పచ్చ కర్పూరం, 3 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే చెక్కర పొంగలి/పరమాన్నం రెడి.ఇది పండుగ రోజులలో ఎక్కువగా చేసుకుంటారు


No comments:

Post a Comment