పాకం బ్రెడ్ (Sugar Bread)

కావలసిన పదార్థాలు :

బ్రెడ్--6
చెక్కర-1 కప్
నీరు--1/4 కప్
ఏలకుల పొడి--1/4 స్పూన్
నూనె--2 కప్స్(వేయించడానికి)


విధానము:

1.సీస మూత తీసుకొని బ్రెడ్ గుండ్రంగా కట్ చేసుకోవాలి.


2.తరువాత నూనె వేడికి పెట్టి, గుండ్రంగా కట్ చేసిన ముక్కలను వేసి దోరగా వేయించాలి.


3.తరువాత ఒక గిన్నెలో చెక్కర వేసి, కొద్దిగా నీరు వేసి తీగ పాకం చేసుకోవాలి.


4.తరువాత చెక్కర పాకం లో ఏలకుల పొడి వేయాలి.


5.తరువాత వేయించుకొని పక్కన పెట్టుకున్న బ్రేడ్ ముక్కలను పాకం లో వేయాలి.


6.పాకం లో వేసిన బ్రెడ్ ముక్కలను పేట్లో పెట్టుకోవాలి.


ఎంతో రుచిగా ఉండే పాకం బ్రెడ్ రెడి.

గమనిక:1. బ్రెడ్ 2 గంటల ముందు ముక్కలు గా కట్ చేసి గాలికి పెడితే, నూనె ఎక్కువగా పీల్చదు

2.బ్రెడ్ నూనె ఎక్కువ పీలుస్తుంది కాబట్టి పేపర్ మీద వేసి, నూనె అంతా పేపర్ పీల్చుకున్నాక పాకం లో వేయాలి.


No comments:

Post a Comment