దొండకాయ నించుడు కూర(Stuffed Tindora Curry)

కావలసిన పదార్థాలు:

దొండకాయలు--1పౌండ్
పసుపు--చిటికెడు
ఇంగువ--చిటికెడు
నూనె--2 స్పూన్స్

విధానము:

పొడి: దొండకాయలలో నించడానికి గుత్తి వంకాయ కూర పొడి తయారు చేసుకోవాలి.

1.దొండకాయలు బాగా కడిగి కుక్కర్ లో పెట్టి 1 విసిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

2.తరువాత కుక్కర్ చల్లగా అయ్యాక దొండకాయలు తీసి, ఒక వైపు కట్ చేసుకోవాలి.

3.తరువాత కట్ చేసిన దొండకాయలలో పొడి నింపుకోవాలి.

4.తరువాత ఒక బాణలి లో 2 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక పసుపు, ఇంగువ వేసి, జాగ్రత్తగా పొడి బయటకు రాకుండా దొండకాయలు వేసి రెండు వైపులా వేయించాలి.

5.తరువాత తగినంత ఉప్పు, వేగిన దొండకాయలపై చల్లి, బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే దొండకాయ నించుడుకూర రెడి.ఇది వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment