Stiuffed Mirchi Bajji (Stuffed Green Chilli Bajji)

కావలసిన పదార్థాలు:

లావు మిరపకాయలు--10-15
శనగ పిండి---11/2 కప్
జీలకర్ర పొడి---1 టీ స్పూన్
ఎర్ర కారం--1 టీ స్పూన్
ఉప్పు---తగినంత
పసుపు--1/4 స్పూన్
ఇంగువ--చిటికెడు
ధనియాల పొడి---1/2 స్పూన్
వాము--1/2 స్పూన్

విధానము:

ఒక చిన్నగిన్నెలో కొద్దిగా శనగ పిండి,ధనియాల పొడి,వాము,ఉప్పు,నూనె వేసి,కొద్దిగా నీరు వేసి ముద్దలా కలుపుకోవాలి.



నించుడు మిర్చి చేసే విధానము:

1.మిరపకాయలు బాగా కడిగి, మధ్యకు కట్ చేసి, తయారు చేసుకొన్నపిండిని కూరాలి.



2.ఒక గిన్నె లో శనగ పిండి, ఎర్ర కారం, జీలకర్ర పొడి, ఉప్పు, ఇంగువ వేసి కొద్దిగా నీరు వేసి జారుగా కాకుండా, పకోడి పిండి లా కలుపుకోవాలి.



3.నూనె వేడికి పెట్టాలి.



4.నూనె వేడి అయ్యాక, పిండిలో మధ్యకు కట్ చేసిన మిరపకాయలు ముంచి, నూనె లో వేయాలి.

5.మిరపకాయలు గోధుమ రంగు వచ్చేలా వేగినాక ప్లేట్ లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే నించుడు మిర్చి బజ్జీ రెడి.



గమనిక:ఉల్లిపాయలు ఇష్టమున్న వారు,మిర్చి బజ్జీలు మధ్యకు కట్ చేసి,చిన్నగా తరిగిన ఉల్లిపాయలు,కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.


No comments:

Post a Comment