పాలక్- ఆలుగడ్డ కూర (Spinach Potato Curry)

కావలసిన పదార్థాలు (ముగ్గురికి సరిపడా):

పాలకూర ---1 కట్ట
ఆలు గడ్డలు--2
ఎర్ర కారం--1/2 స్పూన్
నువ్వులు---1/4 స్పూన్
ఉప్పు---తగినంత
తిరగమాత గింజలు:(అన్నీ1/4 స్పూన్)
ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర
ఇంగువ--చిటికెడు

విధానము:

1.నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి.

2. పాలకూర, ఆలు గడ్డలు బాగా కడిగి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

3.బానలి పెట్టి,2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు వేసుకోవాలి.

4.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, ఆలుగడ్డ ముక్కలు వేయాలి.

5.కొంచం ఆలు గడ్డలు వేగినాక, పాలకూర వేసి బాగా కలిపి, మూత పెట్టాలి.

6.పలకూర,ఆలుగడ్డలు బాగా ఉడికినాక, నువ్వుల పొడి, ఎర్ర కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.

7.చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .

ఎంతో రుచిగా ఉండే పాలక్ -ఆలుగడ్డ కూర రెడి. ఈ కూర అన్నం లోకి, చపాతి లోకి బాగుంటుంది.


No comments:

Post a Comment