సమోసా (Samosa)

కావలసిన పదార్థాలు:

మైదా---1 కప్
గోధుమ పిండి--2 స్పూన్స్
సూజి/బొంబాయి రవ---3 స్పూన్స్
ఉప్పు-- తగినంత

కూరకు కావలసిన పదార్థాలు:

ఆలుగడ్డలు--3
పచ్చి బఠానీలు---3 స్పూన్స్
ఉల్లిపాయ---1
అల్లం--చిన్న ముక్క
పచ్చిమిర్చి---3
పసుపు--చిటికెడు
కొత్తిమీర,కరివేపాకు---2 రెమ్మలు
గరం మసాల---1/4 స్పూన్
ఎర్ర కారం---1/4 స్పూన్
ధనియాల పొడి--1/4 స్పూన్
జీలకర్ర పొడి--1/4 స్పూన్
ఆవాలు---1/4 స్పూన్
ఇంగువ--చిటికెడు
నూనె---3 కప్స్ (వేయించడానికి)

కూర చేసుకొనే విధానము:

1.ఆలుగడ్డలు,పచ్చి బఠానీలు కుక్కర్ లో ఉడికించు కోవాలి.

2.ఉడికించిన ఆలుగడ్డలు చిన్నగా కట్ చేసుకోవాలి.

3.ఉల్లిపాయలు,పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

4.బానలి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక ఆవాలు, ఇంగువ వేయాలి.

5.ఆవాలు చిట చిట అన్నాకా ,ఉల్లిపాయలు ,అల్లం, పచ్చి మిర్చి వేయాలి.

6.ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక, చిన్నగా కట్ చేసిన ఆలుగడ్డలు, పచ్చి బఠానీలు వేసి కూర అంతా బాగా కలపాలి.

7.తరువాత ఎర్ర కారం, గరం మసాల ,ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

8.చివరిలో కరివేపాకు, కొత్తిమీర వేయాలి.

అంతే ఆలుగడ్డ కూర రెడి.
సమోసా చేసే విధానం:

1.ఒక గిన్నె లో మైదా, బొంబాయి రవ,గోధుమపిండి,ఉప్పు,2 స్పూన్స్ నూనె వేసి కొంచం నీరు వేసి, పూరి పిండి లా కలుపుకోవాలి.

2.తయారు చేసుకున్న పిండిని చిన్న ఉంట గా చేసి, పూరీలా చేసుకోవాలి.
3. తయారు చేసుకున్న పూరి ని సగానికి కత్తి తో కట్ చేయాలి.4.కట్ చేసిన పూరి మధ్య లో కూరను పెట్టాలి.5.తరువాత పూరి మధ్యలో ఉన్న కూరను పూరి చివరి భాగముతో కప్పాలి.6.అలాగే రెండవ చివరను కూడా కప్పాలి.7.అప్పుదు సమోసా కోన్ లాగా తయారవుతుంది.8.ఇలా తయారు చేసుకున్న సమోసాలని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.9. తరువాత నూనె వేడి కి పెట్టాలి.

10.నూనె వేడి అయ్యాక, పక్కన పెట్టుకొన్న సమోసాలని వేసి, గొధుమ రంగు వచ్చేలా వేయించి, ప్లేట్ లో తీసుకోవాలి.11.ఇలా తయారు చేసుకొన్న సమోసాలు ,కొత్తిమీర పచ్చడి /టమోట సాస్/చిల్లి సాస్/కెచప్ తో తింటే చాలా బాగుంటుంది.

ఎంతో రుచిగా ఉండే సమోసా రెడి.


No comments:

Post a Comment