సగ్గుబియ్యము వడ (Sabudana Vada)

కావలసిన పదార్థాలు:

సగ్గు బియ్యము ----1 గ్లాసు
(కొంచము నీరు వేసి 1 గంట నాన పెట్టుకోవాలి)
ఆలు గడ్డలు---- చిన్నవి 3లేక 4 (ఉడక పెట్టుకోవాలి)
వేరు శనగ విత్తనాలు---50గ్రాములు
(వేయించి పొడి చేసుకోవాలి)
బ్రెడ్--- 2 పీసెస్(చిన్నగా ముక్కలు చేసుకోవాలి)
ఎర్ర కారము ----1/4 స్పూను
గరం మసాల ----1/4 స్పూను
కొత్తిమీర---- 2 రెమ్మలు
ఉప్పు---- తగినంత
నూనె ----2 గ్లాసులు (వేయించడానికి)

విధానము:

1.సగ్గుబియ్యము ఒక ప్లేటు లో తీసుకొని (నీరు లేకుండా పేపర్ మీద వేసి తడి లేకుండా చేసుకోవాలి)

2. అందులోకి ఉడికిన ఆలు గడ్డలు, బాగా మెత్త గా చేసుకొని వేయాలి.

3.అలాగే చిన్నగా చేసుకున్న బ్రెడ్ ముక్కలు ,కారాము ,గరం మసాల ,ఉప్పు,చిన్నగా తరిగిన పచ్చి మిర్చి, కొత్తిమీర, వేరు శనగ విత్తనాల పొడి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి .

4.తరువాత చిన్న వుంటలు గా చేసుకొని, రెండు చేతుల మధ్య లో పెట్టి కొంచం వత్తాలి .

5.అప్పుడు గుండ్రంగా కాకుండా ఒవల్ షేపు లో వస్త్తాయి.

6.ఇలా చేసిన వడలను, నూనె లో వేసి వేయించాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యము వడ రెడి.


No comments:

Post a Comment