అటుకుల మిక్చర్ (Rice Flakes Mixture)

కావలసిన పదార్థాలు:

అటుకులు-- 3 కప్స్
ఎర్ర కారం--1 టీ స్పూన్
ఉప్పు--1 టీ స్పూన్
ఇంగువ--1/4 టీ స్పూన్
కరివేపాకు--5-10 ఆకులు
వెల్లుల్లి--2 తొనలు
పసుపు--1/2 స్పూన్
పుట్నాల పప్పులు--1/4 కప్
వేరు శనకాయ విత్తనాలు--1/4 కప్

విధానము:

1.నూనే వేడికి పెట్టాలి.

2.జాలరి గరిట (మెష్ ఉండే గరిట)వేడి నూనె లో పెట్టి అందులోకి గట్టి అటుకులు వేసి, వేగిన వెంటనే(అటుకులు కొద్దిగా లావుగా అయ్యాక) పేపర్ వేసిన ప్లేట్ లో తీసుకోవాలి.

3.తరువాత పుట్నాల పప్పులు కూడా వేసి వేయించి, వేయించిన అటుకులలో కలపాలి.

4.వేరుశనకాయలు కూడా వేసి వేయించి, అటుకులలో కలపాలి.

5.కరివేపాకు, దంచిన వెల్లుల్లి ,వేయించి అటుకులలో కలపాలి.

6.తరువాత పసుపు, ఉప్పు, ఎర్ర కారం ,ఇంగువ వేసి బాగా కలపాలి.

ఎంతో రుచిగా ఉండే అటుకుల మిక్చర్ రెడి.


No comments:

Post a Comment