అరటికాయ చిప్స్(Raw Banana Chips)

కావలసిన పదార్థాలు:

అరటికాయలు—2
ఉప్పు--చిటికెడు
నూనె--2 కప్స్ (వేయించిడానికి)విధానము:

1.అరటికాయ తొక్కను కత్తితో పూర్తిగా తీసేయాలి.(అరటిపండు వల్చినట్టు తీసేయాలి).

2.చిప్స్ పీటతో పల్చగా, గుండ్రంగా తరుక్కోవాలి.

3.నూనె వేడికి పెట్టాలి.

4.నూనె వేడి అయ్యాక, విడి విడి తరిగిన అరటికాయలను వేయాలి. ఒక దాని మీద ఒకటి కాకుండా విడి విడి గా వేయాలి.

5.అరటికాయలు కొద్దిగా వేగినాకా,1/2 స్పూన్ నీళ్ళలో 1/4 టీ స్పూన్ ఉప్పు కలిపి అరటికాయలు వేయిస్తున్న నూనె లో వేయాలి.( జాగ్రత్తగా వేడి నూనె లో వేయాలి)

6.తరువాత ఎర్రగా వేయించాలి.(నల్లగా వేయించరాదు)

ఎంతో రుచిగా ఉండే అరటికాయ చిప్స్ రెడి.వీటిని అన్నంలో కూడా తినవచ్చు.

గమనిక:నీళ్ళలోఉప్పు కలిపి నూనె లో వేయడం కష్టమనుకుంటే,అరటికాయలు వేయించిన తరువాత ఉప్పు వేసుకోవచ్చు.


No comments:

Post a Comment