అరటికాయ బజ్జి (Raw Banana Bajji)

కావలసిన పదార్థాలు:

అరటికాయ--1
శనగ పిండి---11/2 కప్
జీలకర్ర పొడి---1 టీ స్పూన్
ఎర్ర కారం--1 టీ స్పూన్
ఉప్పు---తగినంత
పసుపు--1/4 స్పూన్
ఇంగువ--చిటికెడు

విధానము:

1.అరటికాయ బాగా కడిగి, పొడవుగా/గుండ్రంగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి.(నీళ్ళలో వేయడం వల్ల అరటికాయలు నల్లగా కాకుండా ఉంటాయి)

2.ఒక గిన్నె లో శనగ పిండి, ఎర్ర కారం, జీలకర్ర పొడి, ఉప్పు, ఇంగువ వేసి కొద్దిగా నీరు వేసి జారుగా కాకుండా, పకోడి పిండి లా కలుపుకోవాలి.

3.నూనె వేడికి పెట్టాలి.

4.నూనె వేడి అయ్యాక, పిండిలో గుండ్రంగా/పొడవుగా తరిగిన అరటికాయ ముక్కలు ముంచి, నూనె లో వేయాలి.

5. అరటికాయలు రెండు వైపులా గోధుమ రంగు లో వేగినాక ప్లేట్ లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే అరటికాయ బజ్జి రెడి.


No comments:

Post a Comment