రవ పకోడి (Rava Pakodi)

కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ -------1 కప్
పెరుగు ----- 1 కప్
ఉల్లిపాయలు ---- 2
పచ్చి మిర్చి ---- 4 లేక 5
అల్లం ----- చిన్న ముక్క
ఉప్పు ----తగినంత
కరివేపాకు ----2 రెమ్మలు
ఇంగువ ----చిటికెడు
నూనె ---- 2 కప్స్ (వేయించడానికి)

విధానము:

1.బొంబాయి రవ , పెరుగులో వేసి బాగా కలిపి అరగంట నానపెట్టాలి.

2.ఉల్లిపాయలు , అల్లం , పచ్చి మిర్చి , కరివేపాకు చిన్నగా తరుక్కోవాలి.

3.తరువాత ఒక గిన్నె తీసుకొని అందులోకి పెరుగులో నాన పెట్టిన బొంబాయి రవ,తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు , పచ్చి మిర్చి, అల్లం, కరివేపాకు , ఇంగువ , ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

4.తరువాత బానలి లో నూనె పెట్టి ,కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని , చిన్న చిన్న పకోడి లా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే రవ పకోడి రెడి.


No comments:

Post a Comment