రసగుల్ల/ బెంగాలి రసగుల్ల (Rasgulla/Bengali Rasgulla)

కావలసిన పదార్థాలు :

పాలు--1 లీటర్/4 కప్స్
చెక్కర---1 కప్
నీరు--3 కప్స్
నిమ్మకాయ రసం--1/4 కప్
పల్చటి గుడ్డ –1
బొంబాయి రవ --1/2 స్పూన్
కుంకుమ పువ్వు--చిటికెడు(ఇష్టమున్నవారు )


విధానము:

1.మందపు గిన్నెలో పాలు వేసి అడుగంటకుండా కాగనివ్వాలి.


2.తరువాత అందులోకి 1/2 నిమ్మకాయ రసం పిండి, పాలను విరగనివ్వాలి.


3.నిమ్మకాయ పిండిన వెంటనే పాలు విరిగిపోతాయి.


4.తరువాత ఒక గిన్నెలో పల్చటి గుడ్డను వేసి ఉంచుకోవాలి.


5.తరువాత పల్చటి గుడ్డపై విరిగిన పాలను వేయాలి.


6. కొంచము కూడా నీరు లేకుండా గట్టిగా గుడ్డను పిండాలి.


7.ఇలా తయారైన మీగడను చెన్న/పన్నీర్ అని అంటారు.


8.ఈ పన్నీర్ పై 1/2 స్పూన్ సూజి/బొంబాయి రవ వేసి 7-10 నిముషాలు నాదుకోవాలి.


9.పన్నీర్ నాదడం వల్ల పన్నీర్ విరిగి పోకుండా మెత్తగా అవుతుంది.


10.ఇలా మెత్తగా అయిన పన్నీర్ను చిన్న ఉంటలుగా చేసుకోవాలి.


11.తరువాత ఒక గిన్నెలో చెక్కర వేయాలి.


12.తరువాత ఏలకుల పొడి /కుంకుమ పువ్వు వేయాలి.


13.తరువాత నీరు వేసి బాగా ఉడికించాలి.(పాకం అవసరం లేదు..బాగా మర్లితే చాలు)


14.తరువాత మర్లిన చెక్కర పాకం లో తయారు చేసుకున్న పన్నీర్ ఉంటలు వేసి, మూత పెట్టి 15-20 నిముషాలు ఉడికించాలి.(మరీ ఎక్కువ వేడిపై కాకుండా ఉండికించాలి)


15.ఇలా చెక్కర పాకం లో ఉడికించిన పన్నీర్ ఉంటలు, రసం పీల్చుకొని లావుగా ,జూసి గా తయారు అవుతాయి.


16.ఇలా తయారైన రసగుల్లాలను ఒక గిన్నెలో తీసుకొని 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.


ఎంతో రుచిగా ఉండే రసగుల్ల/బెంగాలి రసగుల్ల రెడి.


No comments:

Post a Comment