పూరీ చాట్/మసాల చాట్/రగడ(Puri Chat/Masaala Chat/Ragada)

కావలసిన పదార్థాలు:

శనగలు--1/2 కప్
ఆలుగడ్డ--1
ఉల్లిపాయ--1
పచ్చి మిర్చి--2
పెరుగు--3/4 కప్
ఇంలీ/చింతపండు చట్ని--2 స్పూన్స్
బ్లాక్ సాల్ట్--1/4 స్పూన్
చాట్ మసాల--1/4 స్పూన్
ధనియాల పొడి--1/4 స్పూన్
కారము--1/4 స్పూన్
ఉప్పు--తగినంత
సన్న కార పూస--1/2 కప్
కొత్తిమీర--2 రెమ్మలు
చిన్న పూరీలు--6-8


విధానము:

1.శనగలు,ఆలుగడ్డ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

2.మిర్చి,కొత్తిమీర, ఉల్లిపాయ చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3.ఒక పేట్లో చిన్నగా తరిగిన ఆలుగడ్డ, ఉడికించిన శనగలు వేసి దానిపై పెరుగు వేసి, దానిపైన సన్న కార పూస వేయాలి.4.తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి.5.తరువాత ఇంలి/చింతపండు చట్ని వేయాలి.6.తరువాత ఎర్ర కారం, ధనియాల పొడి, చాట్ మసాల, ఉప్పు, బ్లాక్ సాల్ట్ వేయాలి.7.తరువాత పూరీలు పెద్ద పెద్ద ముక్కలు గా పొడి చేసి మసాల పైన వేయాలి.8.చివరిలో కొత్తిమీర, పచ్చి మిర్చి వేయాలి.ఎంతో రుచిగా ఉండే పూరీ చాట్/మసాల చాట్/రగడ రెడి.
No comments:

Post a Comment