ఆలుగడ్డ కూర (Potato Curry)
కావలసిన పదార్థాలు (ముగ్గురికి సరిపడా):
ఆలు గడ్డలు--3
పచ్చి మిరపకాయలు---3
జీలకర్ర పొడి--1/2 స్పూన్
ఉప్పు---తగినంత
తిరగమాత గింజలు:(అన్నీ1/4 స్పూన్)
ఉద్దిపప్పు,శనగపప్పు,ఆవాలు,జీలకర్ర
ఇంగువ--చిటికెడు
విధానము:
1.ఆలుగడ్డలు బాగా కడిగి, ఉడికించి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
2.బానలి పెట్టి,2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు వేసుకోవాలి.
3.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు వేయాలి.
4.తరువార జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. (కారం ఎక్కువ కావాలనుకుంటే ఎర్ర కారం వేసుకోవచ్చు)
5.చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .
ఎంతో రుచిగా ఉండే ఆలుగడ్డ కూర రెడి. ఈ కూర అన్నం /చపాతి/పూరీకి బాగుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment