పాటోలి (Patoli)

కావలసిన పదార్థాలు:

గోరుచిక్కుడు/బీన్స్/మునగకాయలు--1/2 పౌండ్
శనగ పప్పు --1 కప్
అల్లం--చిన్న ముక్క
పచ్చి మిర్చి--4లేక6
వెల్లుల్లి--2 రెబ్బలు(ఇష్టమున్న వారు)
కరివేపాకు--1 రెమ్మ
పసుపు---1/2 స్పూన్
నూనె--2 స్పూన్
తిరగమాత గింజలు(అన్నీ1/4స్పూన్)
(శనగపప్పు,ఉద్దిపప్పు,జీలకర్ర, ఆవాలు,ఇంగువ)
ఉప్పు---తగినంత

విధానము:

1.శనగపప్పు 2 లేక 3 గంటలు నానపెట్టాలి.

2.గోరుచిక్కుడుకాయలు(బీన్స్/మునగకాయలు) కుక్కర్ లో ఉడికించుకోవాలి.

3.అల్లం,పచ్చిమిర్చి చిన్నగా కట్ చేయాలి.

4.నానపెట్టిన శనగ పప్పు,అల్లం, పచ్చిమిర్చివేసి ,మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేయాలి.

5.బానలిలో నూనె వేసి, వేడి అయ్యాక తిరగమాత గింజలు వేయాలి.

6.తిరగమాత వేగినాక గ్రైండ్ చేసిన శనగ పప్పు పేస్ట్ వేసి బాగా కలపాలి.

7.శనగ పప్పు పేస్ట్ బాగా ఉడికినాక, ఉడికించిన కూరలు వేసి బాగా కలపాలి.

8.తరువాత పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి.

9. తరువాత బానలిపై మూతపెట్టి, 2 నిముషాలు సన్నటి సెగపై ఉడికించి, స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే పాటోలి రెడి. ఇది వేడి అన్నం లో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.


No comments:

Post a Comment