పాలక్ పన్నీర్ (Palak Paneer)

కావలసిన పదార్థాలు:

పాలకూర -- 1 కట్ట
పన్నీర్ -- 1/2 కప్
ఉల్లిపాయ -- 1
టమొటా-- 2
పచ్చి మిర్చి --2
అల్లం వెల్లుల్లి పేస్ట్--1/2 స్పూన్
జీలకర్ర --1/2 స్పూన్
చెక్క--2 ముక్కలు
ఏలకులు --3
లవంగాలు -- 3
కసూరి మేతి --1/4 స్పూన్
(ఎండిన మెంతి ఆకుల పొడి)
పసుపు --1/4 స్పూన్
గరం మసాల-1/4 స్పూన్
ధనియాల పొడి --1/4 స్పూన్
జీలకర్ర--1/4 స్పూన్
ఎర్ర కారం --1/4 స్పూన్
విప్పుడ్ క్రీం -- 3 స్పూన్స్(ఇష్టమైతే)
నూనె --- 4 టేబుల్ స్పూన్

పన్నీర్ చేసే విధానము:

1.పాలు 2 కప్పులు బాగా మర్లినాక 1 స్పూన్ నిమ్మ రసం వేయాలి.

2.అప్పుడు పాలు విరిగి పోతాయి.

3.తరువాత విరిగిన పాలను పల్చని బట్టతో వాడ్చుకొని గట్టిగా పిండాలి. (అంటే నీరు అంతా పోయి మీగడ మాత్రమే మిగులుతుంది)

4.ఈ మీగడను ఒక ప్లేట్ పై వెడల్పుగా చేసి ముక్కలు గా కట్ చేసుకోవాలి.

5.ఇలా కట్ చేసిన మీగడ ముక్కలను డీ-ఫ్రిడ్జ్ లో 4 గంటలు పెడితే బాగా గట్టి పడి పన్నీర్ తయారవుతుంది.

పాలక్ పన్నీర్ చేసే విధానము:

1. ఒక గిన్నెలో పాలకూర వేసి ,కూర మునిగేలా నీరు వేసి మూత పెట్టకుండా బాగా ఉడికించాలి.( మూత పెడితే పాలకూర నల్లగా గా అవుతుంది)

2.తరువాత నీరు వాడ్చేసి పాలకూర మాత్రమే గ్రైండ్ చేయాలి.

3.ఉల్లిపాయలు,టమొటా,పచ్చి మిర్చి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.


4.బాణలి లో 4 స్పూన్స్ నూనె వేసి, జీలకర్ర, ఏలకులు, లవంగాలు, చెక్క, కసూరి మేతి వేసి వేయించాలి.


5.తరువాత వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.

6. తరువాత ఉల్లిపాయలు వేసి ఎర్ర గా వేయించాలి.

7. తరువాత టమొటా, పచ్చి మిర్చి వేసి ఎర్ర గా వేయించాలి.

8.తరువాత పసుపు, ఎర్ర కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి.


9.తరువాత గ్రైండ్ చేసిన పాలకూర వేసి బాగా కలిపి ఉడికించాలి.

10.తరువాత పన్నీర్ ముక్కలు, గరం మసాల పొడి వేసి 2 నిముషాలు ఉడికించాలి.

11.చివరిలో క్రీం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ రెడి. ఇది చపాతి/నాన్ తో తింటే చాలా బాగుంటుంది.No comments:

Post a Comment