పాలక్ పకోడి (Palak Pakodi)

కావలసిన పదార్థాలు:

శనగ పిండి----1 కప్
పాల కూర---1 కప్
ఉప్పు-----తగినంత
ఎర్ర కారం----1/2 స్పూన్
జీలకర్ర పొడి---1/2 స్పూన్
ఇంగువ---చిటికెడు
నూనె ----2 కప్స్(వేయించడానికి)

విధానము:

1.పాలకూర ఆకులు బాగా కడి పక్కన పెట్టుకోవాలి.

2.ఒక గిన్నె లో శనగ పిండి, ఎర్ర కారం, ఉప్పు, ఇంగువ, జీలకర్ర పొడి వేసి కొంచం నీరు వేసుకొని, పకోడి పిండి లా గట్టిగా కలుపుకోవాలి.

3.నూనె వేడికి పెట్టాలి.

4.నూనె వేడి అయ్యాకా, కలిపిన శనగ పిండి లో పాలకూర ఆకును ముంచి జాగ్రత్తగా నూనె లో వేసి వేయించాలి.

5. రెండు వైపులా గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.

6.ఇలా వేయించిన పాలక్ పకోడి ని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే కర కరలాడే పాలక్ పకోడీ రెడి.


No comments:

Post a Comment