ఉల్లిపాయ పకోడి (Onion Pakodi)

కావలసిన పదార్థాలు:

శనగ పిండి ---1 గ్లాసు
ఉల్లిపాయలు --- 2
అల్లం ---- చిన్న ముక్క
కరివేపాకు --- 1 రెమ్మ
బియ్యప్పిండి --- 2 స్పూన్స్
పచ్చి మిర్చి --- 3 లేక 4
ఉప్పు -- తగినంత
పసుపు ---- చిటికెడు
ఇంగువ -- --చిటికెడు
నూనె ---- 2 గ్లాసులు (వేయించడానికి)

విధానము:

1.ఉల్లిపాయలు పొడవుగా తరుక్కోవాలి.

2.అల్లం ,పచ్చి మిర్చి , కరివేపాకు చిన్నగా తరిగి పెట్టుకోవాలి.

3. ఒక గిన్నె లో శనగ పిండి , బియ్యప్పిండి, చిటికెడు పసుపు , చిటికెడు ఇంగువ , పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, తరిగిన అల్లం , పచ్చి మిర్చి , కరివేపాకు , తగినంత ఉప్పు వేసి కొంచం నీరు వేసి బాగా కలపాలి.

4 ఉల్లిపాయలలో నీరు వుంటుంది కాబట్టి నీరు వేయకపోయినా బాగుంటుంది.

5 ఎక్కువ నీరు వేస్తే పకోడి మెత్తగా వస్తుంది. సాధ్యమైనంత తక్కువ నీరు వేసుకుంటే పకోడి కర కర లాడుతూ వస్తాయి.

6.ఇష్టం వున్న వారు వెల్లుల్లి కుడా వేసుకోవచ్చు.

7.ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కొంచం కొంచం తీసుకొని నూనె లో వేసి ఎర్రగా వేయించుకోవాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే ఉల్లి పకోడి రెడి.


No comments:

Post a Comment