నిప్పట్టు(Nipattu)

కావలసిన పదార్థాలు:

బియ్యప్పిండి--5 కప్స్
వేరు శనగ విత్తనాలు--1 కప్
పప్పులు-- 1కప్
కొబ్బెర పొడి--1 కప్
కారం--1 స్పూన్
నువ్వులు--2 స్పూన్స్
ఇంగువ--1/2 స్పూన్
ఉప్పు--తగినంత
నూనె--1/4 కప్
నూనె--4 కప్స్(వేయించడానికి)


విధానము:

1.ఒక గిన్నె లో బియ్యప్పిండి వేసుకోవాలి.2.దానిలోకి వేరు శనగ విత్తనాలు పొడి వేయాలి.(వేయించి పొడి చేయాలి)3.తరువాత పప్పుల పొడి వేయాలి.(వేయించనవసరం లేదు)4.తరువాత కొబ్బెర పొడి వేయాలి.5.తరువాత కారం వేయాలి.6.నువ్వులు వేయాలి.(వేయించనవసం లేదు)7.తరువాత ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి.8.చివరిలో నూనె వేసి బాగా కలపాలి.9.ఇలా కలిపిన పిండిని కొద్దిగా చేతితో తీసుకుంటే ఉంటలా రావాలి.(ఒకవేల ఉంట రాకపోతే మరికాస్త నూనె వేయాలి. పిండి ఉంట రాకపోతే నిప్పట్టు చేసేటప్పుడు విరిగిపోతాయి)

10.తరువాత ఒక చిన్న గిన్నె లో కొద్దిగా పిండి తీసుకోవాలి.

11.కొద్దిగా తీసుకున్న పిండి లో, కొద్ది కొద్దిగా నీరు వేసి కలపాలి.12.జారుగా కాకుండా గట్టిగా పిండిని కలపాలి.( నిప్పట్టు చేయడానికి వీలుగా కలపాలి)13.తరువాత ప్లాస్టిక్ పేపర్ పై కొద్దిగా నూనె వేసి, పిండిని చిన్నగా ఉంటగా చేసి పెట్టాలి.14.ఉంటగా చేసిన పిండిని చేతితో గుండ్రంగా తట్టి, మధ్య లో రంద్రం పెట్టాలి.(ఇష్టము లేకపోతే మధ్య లో రంద్రం పెట్టనవసరం లేదు)

15.తరువాత బానలి లో నూనె పెట్టి వేడి చేయాలి.

16.తరువాత తయారు చేసుకొన్న నిప్పట్లను నూనె లో వేసి రెండు వైపులా ఎర్రగా వేయించాలి.ఎంతో రుచిగా ఉండే నిప్పట్టు రెడి.


No comments:

Post a Comment