నించుడుకాయ (Ninchudukaaya)

కావలసిన పదార్థాలు:

లేతవంకాయలు/కాప్సికం/
లావుగా వున్నపచ్చిమిరపకాయలు–8
నువ్వులు ---1 గరిట
వేరుశనగ విత్తనాలు ---1 గరిట
ఎండుకొబ్బెర ----1/2 గరిట
చెక్క--- 3 చిన్న ముక్కలు
ఎండు మిరపకాయలు ----10
ఉద్దిపప్పు --- 1/2 గరిట


విధానము:

పొడి చేసుకునే పద్దతి:

1.పైన చెప్పిన వన్ని , 1/2 స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి.

2.తరువాత అన్నికలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత తగినంత, ఉప్పు 1/2స్పూన్ నూనె వేసి బాగ కలుపుకోవాలి.

కూర చేసుకునే విధానము:

1. తరువాత లేత వంకాయలు/బెంగళూరు వంకాయ (కాప్సికం) నాలుగు పక్షాలుగా చేసి ,మనము గ్రైండ్ చేసిన పొడిని నింపుకోవాలి.

2. తరువాత బానలి లో, కొంచము నూనె వేసి, ఆవాలు, ఉద్దిపప్పు, శెనగపప్పు, జీలకర్ర, ఇంగువ వేసి,పొడి నింపిన వంకాయలు/ లావు మిరపకాయలు వేసి మూత పెట్టాలి.

3. మధ్య మధ్య లో, మాడ కుండా కలుపుతూ వుండాలి.

4. ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇది అన్నము లో గాని ,చపాతి కి గాని బాగుంటుంది.


No comments:

Post a Comment