మైసూర్ బోండా (Mysoore Bonda)

కావలసిన పదార్థాలు:

మైదా---- 1 కప్
బియ్యప్పిండి---1/4 కప్
పచ్చి మిర్చి---4
అల్లం--- చిన్న ముక్క
పెరుగు---1 కప్
ఉప్పు----తగినంత
జీలకర్ర--1/4 స్పూన్
ఇంగువ--చిటికెడు
బేకింగ్ సోడ---1/4 స్పూన్
కరివేపాకు---5 లేక 10

విధానము:

1.ఒక గిన్నే లోకి మైదా, బియ్యప్పిండి, ఉప్పు, ఇంగువ, బేకింగ్ సోడ, పెరుగు వేసి బాగా కలిపి 2 నుంచి 3 గంటలు నానపెట్టాలి.

2జీలకర్ర,అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు చిన్నగా తరిగి, నానపెట్టిన పిండి లో కలపాలి.

3.నూనె వేడికి పెట్టాలి.

4.నూనె వేడి అయ్యాక, పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసి నూనె లో వేయాలి.

5.బోండాలు గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.

6.గోధుమ రంగుగా వేగిన మైసుర్ బోండాలను ఒక ప్లేట్ లో తీసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే మైసూర్ బోండా రెడి.ఈ బోండాలను వేరుశనకాయ/కొబ్బరి పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.


గమనిక:మైసూర్ బోండాలు వేడి మీదా తింటే చాలా బాగుంటాయి.చల్లగా అయితే బోండాలు సాగినట్టు అవుతాయి.


No comments:

Post a Comment