బొరుగుల/ముర్మురా చాట్(కారం బొరుగులు) (Murmura chat)

కావలసిన పదార్థాలు:

బొరుగులు--4 కప్స్
ఉల్లిపాయ --1 చిన్నది
టమొటా -- 1
పచ్చి మిర్చి --2
కొత్తిమీర --4 రెమ్మలు
ఉప్పు -- 1/4 స్పూన్
పసుపు--చిటికెడు
నిమ్మకాయ -- 1
బూంది--1/4 కప్
గరం మసాల -- చిటికెడు
ధనియాల పొడి --- చిటికెడు


విధానము:

1.బానలి లో 1/2 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక పసుపు, బొరుగులు వేసి 5 నిముషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

2.తరువాత ఒక గిన్నె లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, టమొటా, పచ్చి మిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

3.ఒక గిన్నెలో వేయించిన బొరుగులు, కట్ చేసిన ఉల్లిపాయ, టమొటా ,కొత్తిమీర వేసి బాగా కలపాలి.

4.తరువాత చిటికెడు గరం మసాల, ధనియాల పొడి , ఉప్పు వేసి బాగా కలపాలి.

5.తరువాత బొరుగుల పైన బూంది వేసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే ముర్మురా/బొరుగుల చాట్ రెడి.
No comments:

Post a Comment