ముక్కల పులుసు(Mukkala Pulusu)

కావలసిన పదార్థాలు:

కారెట్--1/2 కప్
సొరకాయ--1/2 కప్
గెన్సు గడ్డలు--1/2 కప్
బెండకాయలు--1/2 కప్
ఆలుగడ్డలు--1/2 కప్
తిరగమాత గింజలు(అన్నీ1/4 టీస్పూన్)
(శనగపప్పు,ఉద్దిపప్పు,ఆవాలు,ఇంగువ)
చింతపండు పులుసు--1 స్పూన్
పసుపు--1/2 టీ స్పూన్
ఎర్ర కారం--1 టీ స్పూన్
బియ్యప్పిండి--2 టేబుల్ స్పూన్
ఉప్పు--తగినంత
బెల్లం-- 1 టీ స్పూన్
కొత్తిమీర--2 రెమ్మలు
కరివేపాకు---5-10

విధానము:

1.కూరలు అన్నీ చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి.

2.ఆలు గడ్డలు, గెన్సు గడ్డలు(తియ్య ఆలుగడ్డలు) చెక్కు తీసి కట్ చేసుకోవాలి.

3.బానలిలో కొద్దిగా నూనె వేసి తిరగమాత వేసుకోవాలి.

4.కూరలు అన్నీ వేసి 1 నిముషము వేయించాలి.

5.తరువాత కూరలు అన్నీ మునిగేలా నీరు వేసి సూప్ లా (జారుగా)తయారు చేసుకోవాలి.

6.తరువాత చింతపండు పులుసు, పసుపు, ఎర్ర కారం, ఉప్పు వేసి బాగా ఉడికించాలి.

7.తరువాత కొత్తిమీర, కరివేపాకు వేయాలి.

8.కూరలు అన్నీ మెత్తగా ఉడికినాక, బెల్లం వేసి కొద్ది సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే ముక్కల పులుసు రెడి. ఇది అన్నము తో తింటే చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment