మిర్చి కా సాలన్/మిర్చి మసాల కూర(Mirchi Kaa Saalan/Mirchi Masaala Curry)

కావలసిన పదార్థాలు:

లావు మిర్చి/బజ్జి మిర్చి--12
వేరు శనగ విత్తనాలు--1/2 కప్
నువ్వులు--1/2 కప్
ఎండు కొబ్బెర--1/2 కప్
జీలకర్ర పొడి--1/2 స్పూన్
ధనియాల పొడి--1 స్పూన్
ఎర్ర కారం--1/2 స్పూన్
పసుపు--1/2 స్పూన్
ఉప్పు --- తగినంత
ఉల్లిపాయ--1
అల్లం వెల్లుల్లి పేస్ట్--1/2 స్పూన్
కరివేపాకు--2 రెమ్మలు
చింతపండు గుజ్జు-- 11/2 స్పూన్
బెల్లం--చిన్న ముక్క

మసాల గింజలు:

చెక్క--2 చిన్న ముక్కలు
లవంగాలు--5
ఏలకులు--5
బేలీవ్స్--3
మెంతులు--1/4 స్పూన్
ఆవాలు--1/2 స్పూన్
జీలకర్ర--1/2 స్పూన్
ఇంగువ
పెరుగు--1/2 కప్
నూనె---2కప్స్(వేయించడానికి)

విధానము:

1. బాణలి లో 2 స్పూన్స్ నూనె వేసి వేరు శనగ విత్తనాలు వేసి కొద్దిగా వేగినాక, నువ్వులు, ఎండు కొబ్బెర వేసి దోరగా వేయించాలి.2.ఇలావేయించిన మిశ్రమాన్ని చల్లార నివ్వాలి.3.తరువాత చల్లగా అయ్యాక, కొద్దిగా నీరు వేసి జారుగా గ్రైండ్ చేసుకోవాలి.4.బజ్జి మిరపకాయలు బాగా కడిగి, మధ్యకు చీల్చి, పక్కన పెట్టుకోవాలి.5.తరువాత బాణలి లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి, మసాల గింజలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.6.తరువాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగినాక, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి.7.తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎర్ర కారం, పసుపు, ఉప్పు వేసి 1 నిముషము పాటు వేయించి, 3 లేక 4 కప్స్ నీళ్ళు వేసి, గ్రైండ్ చేసిన పేస్ట్ వేయాలి.8.తరువాత పెరుగు వేసి 5 నిముషాలు ఉడికించాలి.9. తరువాత బెల్లం, చింతపండు వేసి 5 నిముషాలు ఉడికించాలి.10.ఉడికించిన మసాలలో మధ్యకు కట్ చేసిన బజ్జి మిర్చి వేసి మూత పెట్టి ఉడికించాలి.

(అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ, మసాల కొద్దిగా గట్టి పడేలా ఉడికించాలి)

అంతే ఎంతో రుచిగా ఉండే బగార బాంగన్/వంకాయ మసాల కూర రెడి.ఇది వెజిటబుల్ రైస్/చపాతి/జీర రైస్/పులావ్ తో తింటే చాలా బాగుంటుంది.


గమనిక: మసాల కొద్దిగా జారుగా ఉన్న, వేరు శనగ విత్తనాల పొడి ఉన్నందున గట్టిపడుతుంది.


No comments:

Post a Comment