పాల పిండిమిరియము(Milk Flour Curry)

కావలసిన పదార్థాలు:

బీరకాయ/పొట్ల కాయ /దోసకాయ(కీర) ----1/2 కేజి
పచ్చి మిరపకాయలు --- 3
మిరియాల పొడి ---1/4 స్పూన్
జీలకర్ర పొడి ----1/4 స్పూన్
బియ్యప్పిండి ---- 2 స్పూన్స్
పాలు ----1 గ్లాసు
ఉప్పు ---- తగినంత
ఆవాలు ---- 1/4 స్పూన్
జీలకర్ర ---- 1/4 స్పూన్


విధానము:

1.కొంచము నీరు స్టవ్ మీద పెట్టి , బాగా వేడి అయ్యాక తరిగి పెట్టుకున్న, బీరకాయ/పొట్ల కాయ /దోసకాయ(కీర) , పచ్చి మిరపకాయలు వేసి , బాగ ఉడకనివ్వాలి.

2.తరువాత జీలకర్ర పొడి,మిరియాల పొడి,ఉప్పు వేయాలి.

3.తరువాత బియ్యప్పిండి నీటి లో కలిపి వేయాలి. చిక్కదనం కోసం. ముక్కలతో పాటు బియ్యప్పిండి కూడా, ఉడకనివ్వాలి.

4.చివరిన స్టవ్ కట్టేసి, పాలు వేయాలి.

5.తరువాత ఆవాలు,జీలకర్ర,ఇంగువ ,కరివేపాకు తిరగమాత వేయాలి.


No comments:

Post a Comment