మెంతి కూర పప్పు(Methi Dal)

కావలసిన పదార్థాలు:

మెంతి కూర—1 కట్ట
టమోటా--1
కంది పప్పు---1 కప్
పచ్చి మిర్చి---4
చింతపండు రసం--1/2
పసుపు--1/4 స్పూన్
తిరగమాత గింజలు:(అన్నీ 1/4 స్పూన్)
ఉద్దిపప్పు, శనగ పప్పు, ఆవాలు)
ఉప్పు--తగినంత

విధానము:

1.కందిపప్పు బాగా కడిగి కుక్కర్ లో పెట్టి ఉడికించాలి.

2.పచ్చి మిర్చి, మెంతి కూర,టమోటా చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

3.బానలి లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తిరగమాత వేసుకోవాలి.

4.తరువాత కట్ చేసిన పచ్చి మిర్చి ,మెంతి కూర వేసి వేయించాలి.

5. మెంతి కూర బాగా వేగినాక, ఉడికించిన కంది పప్పు వేయాలి.

6.తరువాత చింతపండు పులుసు, పసుపు, ఉప్పు వేయాలి.

7.తరువాత మిశ్రమం అంతా బాగా కలిసేలా 5 నిముషాలు ఉడికించాలి.

8.తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే మెంతి కూర పప్పు రెడి. ఇది అన్నం తో బాగుంటుంది.

గమనిక: కంది పప్పుతో పాటు మెంతి కూర,టమోటా కూడా ఉడికించుకోవచ్చు.


No comments:

Post a Comment