మద్దూరు వడ (Madduru Vada)

కావలసిన పదార్థాలు:

బియ్యప్పిండి --1 1/2 కప్
బొంబాయి రవ/సూజి--1/4 కప్
మైదా---1/4 కప్
వేరు శనగ విత్తనాలు--2 స్పూన్స్
నువ్వులు--2 స్పూన్స్
ఉల్లిపాయ --- 2
పచ్చి మిర్చి--6-7
కరివేపాకు-- 10 ఆకులు
కొత్తిమీర--2 రెమ్మలు
ఇంగువ-- చిటికెడు
వంట సోడ-- చిటికెడు
ఉప్పు-- తగినంత
నూనె--3/4 కప్(పిండి కలపడానికి)
నూనె--- 3 కప్స్ (వేయించడానికి)


విధానము:

1.ఉల్లిపాయలు చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.2.వేరు శనగ విత్తనాలు వేయించి, పొట్టు తీసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.3.పచ్చిమిర్చి,కొత్తిమీర,కరివేపాకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.4.తరువాత ఒక గిన్నె లో బియ్యప్పిండి, బొంబాయి రవ, మైదా వేయాలి5.తరువాత సోడ, ఇంగువ వేసి బాగా కలపాలి.6.తరువాత గ్రైండ్ చేసిన వేరు శనగ పొడి, పచ్చి మిర్చి మిశ్రమము, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

7.చివరిలో నువ్వులు వేయాలి.8.తరువాత తగినంత ఉప్పు వేసి మిశ్రమం బాగా కలిసేలా కలపాలి.9.తరువాత దానిపై నూనె వేసి ముద్దగా కలపాలి.10.ఇప్పుడు మద్దూరు వడ మిశ్రమం తయారు అయ్యింది.11.ఇలా తయారు అయిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉంటలు గా చేసుకోవాలి.

12.తరువాత చిన్న గా చేసుకున్న ఉంటను ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి వత్తాలి.13.ఇలా వత్తిన వడలను నూనె లో వేయించాలి.

14.తరువాత వేయించిన వడలను ప్లేట్ లో పెట్టుకోవాలి.ఎంతో రుచిగా ఉండే మద్దూరు వడ రెడి. ఈ వడ సాస్/కొబ్బెర పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.గమనిక:మద్దూరు వడ పిండి కలిపేటప్పుడు నీరు వాడకుండా నూనె తో కలిపితే చాలా బాగుంటుంది.

2.నూనె ఎక్కువ అవుతుంది అనుకునేవారు 3/4 నూనె,1/4 నీరు వేసుకొని కూడా పిండి కలుపుకోవచ్చు.


No comments:

Post a Comment