కోలబలిగలు (Kolabaligalu)

కావలసిన పదార్థాలు:

బియ్యప్పిండి ---- 4 కప్స్
పచ్చికొబ్బెర ---1/2 కప్ (తురిమినది)
పచ్చిమిర్చి---10 (గ్రైండ్ చేయాలి)
నూనె /డాల్డ --- 1/2 గరిట
ఉప్పు ---- తగినంత
ఇంగువ ---- చిటికెడు

విధానము:

1.బియ్యప్పిండి లో డాల్డ/నూనె కాచి పోయాలి.

2.తరువాత ఇంగువ, గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి, కొబ్బెర, ఉప్పు వేసి, బాగా కలుపుకోవాలి.

3.తరువాత కొంచము కొంచము తీసుకొని,నీరు వేసుకుంటూ, కోలబలిగలు చేయాలి.

4.అంటే కొంచము పిండి తీసుకొని,పొడవుగా,తీగలా చేసుకొని దాన్ని చక్రము లాగా చుట్టాలి.

5.ఇలాచుట్టిన కోలబలిగలను నూనె లో వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించుకోవాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే కోలబలిగలు రెడి.


No comments:

Post a Comment