కరాచి హల్వా/బొంబాయి హల్వా(Karachi Halwa/Bombay Halwa)

కావలసిన పదార్థాలు :

కార్న్ పిండి--3/4 కప్(50 గ్రాములు)
నెయ్యి--3/4 కప్(50 గ్రాములు)
చెక్కర--1 కప్(200 గ్రాములు)
ఎరుపు కలర్-- చిటికెడు
ఏలకుల పొడి--1/2 స్పూన్
జీడిపప్పు--4 స్పూన్స్


విధానము:

1.ఒక గిన్నెలో 1 కప్ చెక్కర వేయాలి.


2.తరువాత 11/2 కప్ నీరు వేసి స్టవ్ మీద పెట్టాలి.


3.చెక్కర బాగా కరిగినాక, బుడగలు బుడగలు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.(పాకం ఏమి అవసరం లేదు...చెక్కర కరిగితే చాలు)4.ఒక గిన్నె లో కార్న్ పిండి వేసుకోవాలి.


5.తరువాత జారుగా పిండి కలుపుకోవాలి.


6.తరువాత ఒక బానలి కొద్దిగా నెయ్యి వేయాలి.


7.తరువాత జారుగా కలిపిన కార్న్ పిండిని వేయాలి.


8.తరువాత స్టవ్ మీద పెట్టి, ఉంటలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.


9.పిండి అంతా దగ్గరగా అయ్యి, ముద్దలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.


10.తరువాత తయారు చేసుకున్న చెక్కర పాకం ను కొద్ది కొద్దిగా వేసి బాగా కలపాలి.


11.తరువాత స్టవ్ ఆన్ చేసి, చెక్కర బాగా కలిసాక, కొద్ది కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి.
12.బానలికు పిండి అంటకుండా బాల్ లాగా తిరుగుతూ ఉన్నప్పుడు, కొద్దిగా కలర్ వేసి బాగా కలపాలి.


13.తరువాత ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.


14.తరువాత జీడిపప్పు వేసి బాగా కలపాలి.


15.తరువాత కొద్దిగా నెయ్యి వేసి 1 నిముషం బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.


16.తరువాత ఒక ప్లేట్ లో వేయాలి.


17.చల్లగా అయ్యాక కత్తి తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.


18.ఇలా కట్ చేసిన ముక్కలను ప్లేట్ లో పెట్టుకోవాలి.ఎంతో రుచిగా ఉండే కరాచి హల్వా/బొంబాయి హల్వా రెడి.


No comments:

Post a Comment