కడై వెజిటబుల్ మసాల (Kadai Vegetable Masala)

కావలసిన పదార్థాలు:

కారెట్---1
ఉల్లిపాయ---1
టమొటా---1
కాప్సికం---1
కాలిఫ్లావర్ ముక్కలు---1 కప్
బఠానీలు---1/2 కప్
నట్స్---1/4 కప్(చిన్నగా కట్
చేసిన జీడిపప్పు,బాదాం,అక్రూట్)
ధనియాల పొడి---1 స్పూన్
జీలకర్ర పొడి----1 స్పూన్
గరం మసాల---1/2 స్పూన్
ఎర్ర కారం---1/2 స్పూన్
నూనె---1 స్పూన్
నెయ్యి---1 స్పూన్
జీలకర్ర----1/2 స్పూన్
లవంగాలు----2
చెక్క---1/2 పీస్
అల్లం వెల్లుల్లి పేస్ట్ ---1 స్పూన్


విధానము:

1.కూరలు అన్ని చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

2.బానలి పెట్టి, నూనె, నెయ్యి వేసి, వేడి అయ్యాక జీలకర్ర, లవంగాలు, చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

3.తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ,కొంచం ఉప్పు వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.(ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి)

4.తరువాత టమొటా కూడా వేసి కొద్దిగా వేయించి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఎర్ర కారం వేయాలి.

5.తరువాత చిన్నగా తరిగిన కూరలు అన్నీ వేసి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

6.కొద్దిగా నీరు వేసి (కూర మాడకుండా ఉండడానికి) మూత పెట్టాలి. కూర ముక్కలన్ని బాగా ఉడకనివ్వాలి.

7.తరువాత మూత తీసి, ఉడికిన కూరలు+మసాల అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి , కొత్తిమీర బాదం,జీడిపప్పు,అక్రూట్ పొడి చల్లాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే కడై వెజిటబుల్ మసాల రెడి, ఈ కూర చపాతి/రోటి/జీర రైస్ తో చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment