కచోరి (Kachori)

కావలసిన పదార్థాలు:

మైదా---2 కప్స్
నెయ్యి/డాల్డ--3 స్పూన్స్
సూజి/బొంబాయి రవ--1 స్పూన్
పెసర పప్పు--3/4 కప్
ఆంచూర్ పొడి --1/4 స్పూన్
ధనియాల పొడి--1/4 స్పూన్
గరం మసాల--1/4 స్పూన్
జీలకర్ర పొడి--1/4 స్పూన్
సోంపు--1/4 స్పూన్
జీలకర్ర--1/2 స్పూన్
కారం--1/4 స్పూన్
ఉప్పు -- తగినంత
ఇంగువ--చిటికెడు
పచ్చి మిర్చి--2
అల్లం--చిన్న ముక్క
నూనె -- 2 కప్స్ (వేయించడానికి)

కచోరి మసాల చేసే విధానము:

1. పెసర పప్పు బాగా కడిగి, 2 గంటలు నాన పెట్టాలి.2.బానలి లో నూనె వేసి, వేడి అయ్యాక జీలకర్ర సోంపు, ఇంగువ వేసి వేయించాలి.

3.తరువాత పెసర పప్పు నీరు లేకుండా వాడ్చి, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి.

4.తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆంచూర్ పొడి, గరం మసాల, కారం, తగినంత ఉప్పు వేసి 2 నిముషాలు వేయించాలి.

5.ఇలా వేయించిన పెసర పప్పును చల్లగా అయ్యాక మిక్సీ లో పొడి చేసుకోవాలి.

ఇప్పుడు కచోరి మసాల తయారు అయ్యింది.కచోరి చేసే విధానము:

1. ఒక గిన్నె లో మైదా, నెయ్యి/డాల్డ ,బొంబాయి రవ, ఉప్పు వేసి తగినంత నీరు వేసి చపాతి పిండి లా కలిపి 30 నిముషాలు నాన పెట్టుకోవాలి.2.నానపెట్టిన మైదా బాగా నాది, చిన్న చిన్న ఉంటలు గా చేసుకోవాలి.3.తరువాత తయారు చేసి ఉంటను చిన్న పూరీ లా చేసుకోవాలి.4.తరువాత పూరీ మధ్య లో, 2 స్పూన్స్ తయారు చేసుకున్న కచోరి మిశ్రమాన్ని ఉంచాలి.5.తరువాత పూరీ పిండి తో, మిశ్రమం బయటకు రాకుండా చుట్టాలి.5.ఇలా చుట్టిన పూరీని రెండు చేతుల మధ్యలో పెట్టి కొద్దిగా వత్తాలి.6.ఇలా తయారు చేసుకున్న కచోరీ లను ప్లేట్ లో పెట్టాలి.7.తరువాత నూనె వేడికి, పెట్టి, జాగ్రత్తగా కచోరీల ను దోరగా వేయించాలి.

ఎంతో రుచిగా ఉండే కచోరి రెడి.ఇది చిల్లి సాస్/కొత్తిమీర చట్నితో తింటే చాలా బాగుంటుంది.
No comments:

Post a Comment