కాజా/మడత కాజా(Kaaja/Madata Kaaja)

కావలసిన పదార్థాలు :(12-15 సరిపడా)

మైదా --2 కప్స్
బేకింగ్ పౌడర్ --1 స్పూన్
డాల్డ -- 7 స్పూన్స్
చెక్కర--3 కప్స్
బియ్యప్పిండి--2 స్పూన్స్
నీళ్ళు --11/2 కప్(పాకం కోసం)
నూనె -- 3 కప్స్ (వేయించడానికి)


విధానము:

1.మైదా,బేకింగ్ పౌడర్,3 టేబుల్ స్పూన్స్ డాల్డ, నీళ్ళు(1/2 కప్/తగినంత)వేసి పూరీ పిండి లా కలుపుకొని, మూత పెట్టి 30 నిముషాలు నాన పెట్టాలి.2. డాల్డ 4 స్పూన్స్,2 స్పూన్స్ బియ్యప్పిండి జారుగా కలుపుకోవాలి.(కొద్ది సేపటికి కొద్దిగా గట్టి పడుతుంది)3.తరువాత పిండి ని చిన్న చిన్న ఉంటలు గా చేసుకోవాలి.4.తరువాత పిండిని స్వ్కయర్ గా పల్చగా వత్తుకోవాలి. ఇలా మూడు చపాతీలు వత్తుకోవాలి.5.తరువాత ఒక్కొక్క చపాతి మధ్యలో డాల్డా+బియ్యపిండి కలిపిన పేస్ట్ ను పూయాలి.6.ఇలా మూడు చపాతీలు ఒక దానిపై ఒకటి పెట్టాలి.7.తరువాత తయారు చేసుకున్న చపాతీని వెడల్పుగా చుట్టాలి.8.చపాతి మొత్తం చాపలా వెడల్పుగా చుట్టాలి.9.తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.10.కట్ చేసుకున్న ముక్కలను చపాతి కర్రతో మధ్యలో కొద్దిగా వత్తాలి.11.ఈ విధంగా వత్తిన కాజాలను ప్లేట్ లో పెట్టుకోవాలి.12.తరువాత గిన్నెలో చెక్కర వేసి, చెక్కర మునిగేలా నీళ్ళు వేసి తీగ పాకం చేసుకోవాలి.13.తరువాత నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక తయారు చేసుకున్న కాజాలను వేసి, రెండు వైపులా దోరగా వేయించాలి.

14.ఇలా దోరగా వేయించిన కాజాలను చెక్కర పాకం లో వేయాలి.15.కాజాలకు పాకం బాగా పట్టినాక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి.ఎంతో రుచిగా ఉండే మడత కాజా రెడి.


No comments:

Post a Comment