గుత్తి వంకాయ (Gutti Vankai)

కావలసిన పధార్థాలు:

వంకాయలు ----1/2 కేజి
ఉద్దిపప్పు ---- 1/4 కప్
శెనగపప్పు ---- 1/4 కప్
వేరు శనగ విత్తనాలు--- 1 కప్
నువ్వులు ---- 1/4 కప్
కొబ్బెర పొడి ----- 1/4 కప్
ఎండు మిరపకాయలు --- 14
దనియాలు -----2 స్పూనులు
చింతపండు ----- ఉసిరికాయంత
ఉప్పు -----తగినంత

పొడి చేసుకునే పద్దతి:

1.నువ్వులు , వేరు శనక్కాయలు విడి విడి గా వేయించుకోవాలి.

2.కొంచం నూనె వేసి, చింతపండు, ఉద్దిపప్పు, శనగపప్పు, వేరు శనక్కాయలు, నువ్వులు కుడా వేసి గ్రైండ్ చేయాలి.

3.నువ్వులు, శనక్కాయ విత్తనాలు , చివరన గ్రైండ్ చేయాలి. లేకపోతే పొడి ముద్దగా అవుతుంది.

కూర చేసుకునే విధానము:

1.వంకాయలు కడిగి,బాగ తుడుచుకోవాలి.కడిగిన వంకాయలు గుండ్రంగా వున్న చోట ప్లస్ గా(+) తరుక్కోవాలి .అంటే తొడిమ కింద భాగము నాలుగు భాగాలు గా , పొడి వేయడానికి వీలుగా, అంటే + గా తరుక్కోవాలి.

2.తయారు చేసిన పొడిని, 1/2 టేబుల్ స్పూను నూనె వేసి, కొంచము ఉప్పు వేసి, కలుపుకోవాలి.

3.నాలుగు భాగాలు గా చేసుకున్న వంకాయల,తయారు చేసుకున్న పొడి ని కూరాలి.

ఇలా అన్ని వంకాయలకు పొడిని కూరుకొని ఉంచుకోవాలి.

4.తరువాత బానలి లో నూనె వేసి , వేడి అయ్యాక ఉద్దిపప్పు , శెనగపప్పు, ఆవాలు , జీలకర్ర, కరివేపాకు,ఇంగువ వేసి , తిరగమాత వేయాలి. కొంచము పసుపు కూడా వేయాలి.

5.తరువాత పొడి నింపిన వంకాయలు వేసి , పైన మూత పెట్టాలి.అప్పుడప్పుడు వంకాయలు విరగకుండా,మాడకుండా కలుపుతూ వుండాలి.

6.చివరిన మిగిలిన పొడిని , ఉడికిన వంకాయల పైన వేయాలి.

అంతే ఎంతో రుచిగా గుత్తి వంకాయ రెడి .No comments:

Post a Comment