పెసల సలాడ్ (Green Moongdal Salad)

కావలసిన పదార్థాలు:

పెసలు--1 కప్
కీరా/దోసకాయ--1
ఉల్లిపాయ--1/2
కారెట్--1
ఉప్పు--తగినంత
నిమ్మకాయ--1


విధానము:

1.పెసలు 3 లేక 5 నానపెట్టాలి.

2.కుక్కర్ లో కొద్దిగా నీరు వేసి,1 విసిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

3.తరువాత నీరు అంతా వాడ్చేయాలి.

4.ఉల్లిపాయలు,దోసకాయ చిన్నగా కట్ చేసుకోవాలి.

5.కారెట్ తురుము కోవాలి.

6.ఒక గిన్నె లో వాడ్చిన పెసలు, తరిగిన ఉల్లిపాయలు, దోసకాయ, కారెట్ తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి.

7.చివరి లో నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి.

ఎంతో రుచిగా ఉండే పెసల సలాడ్ రెడి.

చిట్కా: పెసలలో ఫైబర్ ఉంటుంది కాబట్టి అరోగ్యానికి చాలా మంచిది.

2. పచ్చి పెసలు నానపెట్టి కూడా సలాడ్ చేసుకోవచ్చు( ఉడికించనవసరం లేకుండా).


.

No comments:

Post a Comment