గోంగూర పులుసు(Gongura Pulusu)

కావలసిన పదార్థాలు:

గోంగూర --- 1 కట్ట
ఉల్లిపాయ --1
శనగ పప్పు--1/2 కప్
పచ్చి మిర్చి---6
చింతపండు పేస్ట్ --1/2 స్పూన్
పసుపు---చిటికెడు
ఇంగువ---చిటికెడు
బియ్యప్పిండి--1 స్పూన్
ఉప్పు--తగినంత
మెంతులు--1 స్పూన్
ఎర్ర కారం -- 1/2 స్పూన్
నూనె -- 2 స్పూన్స్

విధానము:

1. గోంగూర కాడలు లేకుండా తీసి బాగా శుభ్రం చేసుకోవాలి.

2.ఉల్లిపాయలు,గోంగూర,పచ్చి మిర్చి చిన్న గా కట్ చేసుకోవాలి.

3.తరువాత కుక్కర్ గిన్నె లో శనగ పప్పు వేసి బాగా కడిగి అందులో, కట్ చేసిన గోంగూర, ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి,1 కప్(తగినంత నీరు) నీరు వేసి మూత పెట్టాలి.

4.తరువాత 3-4 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

5.తరువాత ఒక గిన్నె లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

6.నూనె వేడి అయ్యాక మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి వేసి కొద్దిగా వేయించాలి.

7.తరువాత ఉడికించిన పప్పు, గోంగూర జాగ్రత్తగా వేసి కలపాలి.

8.ఒక చిన్న గిన్నె లో 1/2కప్ నీళ్ళు తీసుకొని దానిలో బియ్యప్పిండి వేసి, ఉంటలు లేకుండా కలిపి, ఉడుకుతున్న గోంగూర పులుసులో వేసి 5 నిముషాలు ఉడికించాలి.

9.తరువాత చింతపండు పులుసు, పసుపు, ఎర్ర కారం, ఉప్పు వేసి 3-4 నిముషాలు ఉడికించాలి.

ఎంతో రుచిగా ఉండే గోంగూర పులుసు రెడి. ఇది అన్నంతో తింటే చాలా బాగుంటుంది.


No comments:

Post a Comment