గోల్డ్ కాయిన్స్ (Gold Coins)

కావలసిన పదార్థాలు:

మైదా---1 కప్
డాల్డ/బటర్/నెయ్యి--3 స్పూన్స్
చెక్కర--1/2 కప్
బేకింగ్ పౌడర్--3/4 స్పూన్
నూనె----2 కప్స్ వేయించడానికి
కేసరి కలర్--చిటికెడు
విధానము:

1.ఒక గిన్నె లో మైదా, డాల్డ/నెయ్యి, బేకింగ్ పౌడర్, చెక్కర,కేసరి కలర్ వేసి, కొంచం నీరు వేసి, పూరీ పిండి లా గట్టిగా కలుపుకోవాలి.

2.తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి.

3.తరువాత తయారు చేసుకున్న ఉంటను, చపాతి లా వత్తుకోవాలి.

4.వత్తిన చపాతిని,గుండ్రంగా కట్ చేసుకోవాలి.

5.నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక,గుండ్రంగా కట్ చేసుకున్నగోల్డ్ కాయిన్స్ వేసి, గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.

6.ఇలా వేయించిన గోల్డ్ కాయిన్స్ ను ప్లేట్ లో తీసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే గోల్డ్ కాయిన్స్ రెడి.No comments:

Post a Comment