గోబి మంచూరియా (Gobi Manchuria)

కావలసిన పదార్థాలు:

గోబి/కాలిఫ్లవర్ -- 2 కప్స్
ఉల్లి కాడలు--2 కట్టలు
వెల్లుల్లి -- 10
సోయా సాస్ --5 స్పూన్స్
పచ్చి మిర్చి --5
ఎర్ర కారం-- 1 స్పూన్ (అవసమైతే)
హాట్&స్వీట్ టమొటా సాస్--5 స్పూన్స్
ఉప్పు--- చిటికెడు
ఆలివ్ నూనె --2 స్పూన్స్
వంట నూనె -- వేయించడానికి
కార్న్ పిండి/శనగ పిండి -- 1 కప్
కొత్తిమీర --- 2 రెమ్మలు

విధానము:

1.కాలి ఫ్లవర్ చిన్న ముక్కలు గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2.కార్న్ పిండి లో కట్ చేసిన కాలిఫ్లవర్ వేసి, పిండి అంతా ముక్కలకు పట్టెలా అద్ది, వాటి పైన నీళ్ళు చిలకరించాలి.(అప్పుడు పిండి బాగా ముక్కలకు అతుకుంటుంది (నీళ్ళు ఎక్కువ వేయరాదు)3.బానలి లో నూనె వేసి ,వేడి అయ్యాక, కార్న్ పిండి లో అద్దిన కాలిఫ్లవర్నుజాగ్రత్త గా వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.4.ఉల్లికాడలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

5.బానలి లో 2 స్పూన్స్ ఆలివ్ నూనె వేసి కట్ చేసిన ఉల్లికాడలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.

6.తరువాత సోయ సాస్, హాట్ & స్వీట్ టమొటా సాస్, చిటికెడు ఉప్పు వేసి వేయించాలి. (సోయ సాస్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి)7.తరువాత వేయించిన కాలిఫ్లవర్లు జాగర్తగా వేసి మిశ్రమం లో బాగా కలపాలి.

8.తరువాత 2 నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరిలో కొత్తిమీర వేసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే గోబిమంచూరీ రెడి. ఇది స్నాక్ గా తిన్నా బాగుంటుంది. లేక్ చైనీస్ ఫ్రైడ్ రైస్ తో తిన్నా బాగుంటుంది.చిట్కా: 1. మీకు మంచూరీ జారుగా కావాలి అం టే ... సోయ సాస్ హాట్ & స్వీట్ టమొటా సాస్ ఎక్కువ వేసి జారుగా చేసుకోవచ్చు.

2. కాలిఫ్లవర్ పై పిండి ఎక్కువ ఇష్టపడే వారు, ఒక గిన్నె లో కార్న్/శనగ పిండి, ఉప్పు, కొద్దిగా కారం వేసి కొద్దిగా నీరు వేసి, పకోడి పిండి లా కలిపి అందులో ఉడికించిన కాలిఫ్లవర్ అద్ది, వేయించి, తయారు చేసుకున్న సాస్ మిశ్రమం లో వేసి ఉడికించుకోవచ్చు.


No comments:

Post a Comment