గిఫ్ట్ బ్యాగ్స్ (Gift Bags)

కావలసిన పదార్థాలు:

మైదా---1 కప్
ఉప్మా రవ/సూజి రవ--2 స్పూన్స్
గోధుమ పిండి---2 స్పూన్స్
కేసర్ కలర్---1/2 స్పూన్
శనగ పప్పు--1 కప్
ఆలు గడ్డలు--2(చిన్నవి)
గరం మసాల--1/4 స్పూన్
జీలకర్ర పొడి--1/4 స్పూన్
ధనియాల పొడి--1/4 స్పూన్
అల్లం--చిన్న ముక్క
కారం--1/4 స్పూన్
ఉప్పు--తగినంత
మిర్చి---3
కొత్తిమీర-- 2 రెమ్మలు
జీలకర్ర--1/4 స్పూన్స్
నూనె--- 2కప్స్ (వేయించడానికి)

విధానము:

కూర చేసుకోనే విధానము:

1.శనగపప్పు,ఆలుగడ్డలు విడి విడి గా ఉడికించుకోవాలి.

2.ఉడికించిన ఆలుగడ్డలు చిన్నగా కట్ చేసుకోవాలి.

3.మిర్చి,అల్లం గ్రైండ్ చేసుకోవాలి.

4.బానలి లో 2 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక జీలకర్ర ఇంగువ వేయాలి.

5.తరువాత ఉడికించిన శనగ పప్పు, చిన్నగా కట్ చేసిన ఆలుగడ్డలు వేసి బాగా కలపాలి.

6.తరువాత గరం మసాల, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గ్రైండ్ చేసిన అల్లం, మిర్చి,కారం వేసి బాగా కలపాలి.

7.తరువాత తగినంత ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

8.తరువాత కూర పైన కొత్తిమీర వేయాలి.గిఫ్ట్ బ్యాగ్స్ కూర రెడి అయ్యింది.

గిఫ్ట్ బ్యాగ్స్ చేసే విధానము:

1.ఒక గిన్నె లో మైదా, సూజి/ఉప్మా రవ, గోధుమ పిండి వేసి, తగినంత ఉప్పు, తగినంత నీళ్ళు వేసి పూరీ పిండి లా గట్టిగా కలుపుకోవాలి.2.3 స్పూన్స్ మైదా లో 1/2 స్పూన్ కేసర్ కలర్ వేసి ముద్దలా కలుపుకోవాలి.3.కలిపిన మైదా పిండిని చిన్న పూరీ లా చేసుకోవాలి.4.పూరీ మధ్యలో 2 స్పూన్స్ తయారు చేసుకున్న కూరను పెట్టాలి.5.కూరను కప్పుతూ పూరీను బ్యాగ్ లా చుట్టాలి.

6.పూరీ అంతా కూరను కప్పి, ఒక బ్యాగ్ లా తయారవుతుంది.7.తరువాత కేసర్ కలిపిన మైదా పిండి పల్చగా తీగలా చేసుకోవాలి.8.తరువాత కేసర్ కలిపిన మైదాను, తయారు చేసుకొన్న బ్యాగ్ పై బాగాన చుట్టాలి. అప్పుడు గిఫ్ట్ బ్యాగ్ లా తయారవుతుంది.9.ఇలా చేసుకున్న గిఫ్ట్ బ్యాగ్స్ ను ఒక ప్లేట్ లో పెట్టాలి.

10.నూనె వేడి కి పెట్టి, నూనె వేడి అయ్యాక తయారు చేసుకున్న గిఫ్ట్ బ్యాగ్స్ వేసి, గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.ఎంతో రుచిగా ఉండే గిఫ్ట్ బ్యాగ్స్ రెడి.

గమనిక:గిఫ్ట్ బ్యాగ్స్ లో ఆలుగడ్డ కూర/శనగల కూర/మిక్స్డ్ వెజిటబుల్ కూర/వేరే ఎదైన కూర కూడా పెట్టుకోవచ్చు.

No comments:

Post a Comment