పెరుగు వడ (Dahi Vada)

కావలసిన పదార్థాలు:

ఉద్దిపప్పు---1 కప్
ఉప్పు---తగినంత
కొత్తిమీర---2 రెమ్మలు
అల్లము--చిన్న ముక్క
పచ్చి మిర్చి---2
పెరుగు---4 కప్స్
నూనె-- 2 కప్స్ వేయించడానికి
తిరగమాత:

ఆవాలు---1/2 స్పూన్
నూనె--2 టీ స్పూన్

వడ చేసే విధానము:

1.ఉద్దిపప్పు 2 గంటలు నాన పెట్టుకోవాలి.

2.నానపెట్టిన ఉద్దిపప్పు, నీరు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.(అవసరమైతే 2 స్పూన్స్ నీరు వేసుకోవచ్చు) సాధ్యమైనంత వరకు పిండి గట్టిగా ఉంటే వడ చేయడానికి వస్తుంది.

3.తరువాత పిండి లో తగినంత ఉప్పు వేసుకోవాలి.

వడ చేసుకోడానికి పిండి తయారు అయింది.పెరుగు చేసుకోనే విధానము:

1.ఒక గిన్నె లో పెరుగు బాగా చిలికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.(వడ పిండి లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచం వేస్తే సరిపోతుంది)

2.అల్లం,పచ్చి మిర్చి గ్రైండ్ చేసి ,గ్రైండ్ చేసిన పేస్ట్ ను పెరుగులో కలపాలి.

3.తరువాత బానలిపెట్టి,2 స్పూన్స్ నూనె వేసి, ఆవాలు, ఇంగువ తిరగమాత వేసి ,పెరుగులో వేయాలి.

4. పెరుగు పైన చిన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి.

ఇప్పుడు పెరుగు తయారైంది.(పెరుగు పుల్లగా లేకపొతే రుచి బాగా ఉంటుంది)పెరుగు వడ తయారు చేసుకొనే పద్దతి:

1.వడ వేయించడానికి నూనె వేడి కి పెట్టాలి.

2.తడి చేతితో పిండిని చిన్న ఉంట తీసుకోవాలి.(తడి చేతితో అయితే వడ సులువుగా నూనే లో జారుతుంది)

3.తరువాత పిండి మధ్యలో బోటన వ్రేలితో రంద్రం పెట్టాలి.4.జాగ్రత్తగా నూనే లో, రంద్రం చేసిన వడని వేయాలి.

5.వడ రెండు వైపులా గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.6.తరువాత తయరు చేసిన వడలను పెరుగులో వేయాలి.


7.వడలు పెరుగులో బాగా మునిగే లా వేయాలి. 8.వడలు పెరుగు పీల్చుకోడానికి కనీసం ఒక గంట పడుతుందిఎంతో రుచిగా ఉండే పెరుగు-వడ రెడి.ఈ వడలపై బూంది లేక సేవ్ మిక్చర్ వేసుకొని తింటే బాగుంటుంది.

చిట్కా:ఒక వేల పిండి జారుగా అయితే 2స్పూన్స్ సూజి/ఉప్మారవ వేసుకొంటే పిండి గట్టిపడి,వడలు వేయడానికి వీలుగా వస్తాయి మరియు వడలు కూడా కరకరలాడుతూ ఉంటాయి.

2.చేతితో వడలు వేయడం రాకపోతే ప్లాస్టిక్ పేపర్ పై ఒక చుక్క నూనె వేసుకొని వడలు వేసుకోవచ్చు.


No comments:

Post a Comment