మజ్జిగ పులుసు (Curd Curry)

కావలసిన పదార్థాలు:

బెండకాయ/పొట్లకాయ/సీమ వంకాయ/
సొరకాయ/వంకాయ--1/2 కేజి
మజ్జిగ -- 2 గ్లాసులు
శెనగపప్పు--- 3 స్పూన్స్
దనియాలు--1 స్పూన్
జీలకర్ర--1/2 స్పూన్
ఆవాలు ---1/4 స్పూన్
టమొటో ---1
పచ్చి మిరపకాయలు---4
అల్లం ---చిన్న ముక్క
కొబ్బెర ---3 స్పూన్స్
కొత్తిమీర-----2 రెమ్మలు
కరివేపాకు-----2 రెమ్మలు
తిరగమాతగింజలు--(అన్నీ1/2 టీస్పూను)
ఉద్దిపప్పు,ఆవాలు జీలకర్ర, ఇంగువ
పసుపు--1/4 స్పూన్
ఉప్పు ---- తగినంత


విధానము:

1.బెండకాయ లేక వంకాయ వేసుకునే వారు,చిన్న చిన్నముక్కలు గా చేసుకొని,1 స్పూన్ నూనె లో వేయించాలి.

2 సీమవంకాయ లేక పొట్లకాయ లేక సొరకాయ వేసుకునే వారు, చిన్న చిన్న ముక్కలు గా చేసుకొని ఉడికించుకోవాలి.

3.శనగపప్పు, దనియాలు, జీలకర్ర ,ఆవాలు 20 నిముషాలు నానపెట్టుకోవాలి.

4.తరువాత నానపెట్టిన శనగపప్పు,దనియాలు, జీలకర్ర, ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బెర, టమొట, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి.

5.తరువాత ఒక గిన్నె లో మజ్జిగ వేసుకోవాలి.

6.అందులోకి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, గ్రైండ్ చేసుకున్నమిశ్రమము, కరివేపాకు ఉడికించిన ముక్కలు లేక వేయించిన ముక్కలు వేసి బాగా మర్లించాలి.

7.బాగా పొంగు వచ్చేదాక మర్లించాలి. తరువాత తిరగమాత వేసుకోవాలి. (అంటే బానలి లో 1/2 టేబుల్ స్పూను నూనె వేసి ,ఉద్దిపప్పు,ఆవాలు,జీలకర్ర ,ఇంగువ వేసుకోవాలి)

ఎంతో రుచిగా వుండే మజ్జిగ పులుసు రెడి.


No comments:

Post a Comment